Sunday, August 15, 2010

అన్నాప్రగడ కామేశ్వర రావు - 1 వ భాగం

64 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలతో...


అన్నాప్రగడ కామేశ్వరర రావు గారు 1902 లో జన్మించారు. తండ్రి రోశయ్య, తల్లి లక్ష్మి దేవి. రోశయ్య గారు నాదెండ్ల గ్రామకరణంగా ఉండేవారు.ఆయనకు మంచి పేరు ఉండేది. కామేశ్వరరావు గారు ప్రాథమిక విద్యనూ గ్రామంలో పూర్తి చేసారు.అయన చిన్నప్పటి నుండి విప్లవ భావాలూ కలిగి ఉండేవారు. 1915 లో కర్నూలు లో మున్సిపల్ హై స్కూల్ లో చదివే టప్పుడు జాతీయ జెండా ఎగురవేసి వందేమాతరం గీతం పాడినారు.

బ్రిటిష్ వారిపై పోరాడాలంటే సైనిక శిక్షణ అవసరమని భావించాడు. 1917 లో నర్సింగ్ పూర్లో సైనికునిగా చేరాడు. జబల్ పూర్ , కంటే నగర్ లో సైనిక శిక్షణ పొందారు. రెండు సంవత్సరాలలో అసామాన్య ప్రతిభ చూపి అధికారిగా ఎదిగాడు.అందుకే సైన్యంతో అందరు 'బర్డి' అనే మారు పేరుతొ పిలిచేవారు.

1919 మే నెలలో బాగ్దాద్ - బస్రా ల మధ్యనున్న ప్రాంతం లోని బద్దూ జాతి ప్రజల తిరుగుబాటుని అనిచివేయటానికి పంపిన సైన్యానికి అధికారిగా ఉన్నారు. అక్కడు ఉంటూనే భారతదేశానికి స్వతంత్రం కావాలని పత్రికల్లో వ్యాసాలు రాసారు. ఈ ప్రాంతంలోని బ్రిటిష్ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపినా నేరానికి బ్రిటిష్ ప్రభుత్వం కోర్ట్ మార్షల్ చేసి ఆయనకు ఉరి శిక్ష విధించింది. భారత దేశం లోని అన్ని ప్రాంతాలలోనే కాకా, వలస దేశాలలో వచ్చిన తిరుగుబాటు వలన, సైన్యంలో చెలరేగిన ఆందోళన వలన ఉరి శిక్ష రద్దు చేసి, సైన్యం నుండి తొలగించారు. ( సశేషం....)

No comments:

Post a Comment