Monday, August 2, 2010

సదా మీ సేవలో

నాదెండ్ల ఆన్ లైన్ బ్లాగ్ వీక్షకులకు నమస్కారం. మన గ్రామం ఎంతో పురాతన మైనది. అనేక సంఖ్యలో ఉన్న దేవాలయాలు, చెరువులు, బావులు మొదలైన వాటి చరిత్ర, వివరాలను ప్రస్తుతం సేకరించటం జరుగుతున్నది. విషయ సేకరణ లో, విశ్లేషణ చేసి మీకు అందించుటలో విశ్వసనీయత కొరకు మేము ప్రయత్నిస్తున్నాము. నోటి మాటగా చెప్పుకునే దాని కన్నా, గ్రాంధికమైన, శాసనమైన ఆధారాలు అందించితే బాగుంటుంది కదా! మన గ్రామా చరిత్ర చెన్నై, హైదరాబాద్ లైబ్రరీ లలో దొరకవచ్చని తెలిసింది. వాటి కోసం ప్రయత్నం చేస్తున్నాం. లోగా గ్రామంలో జరిగే ఉత్సవాల గురించి ఎప్పటికప్పుడు సవివరంగా తెలియజేయగలము.

త్వరలో మన బ్లాగ్ లో తెలుగు భాషలో బాలలకు సంబంధించిన ప్రక్రియ లైన జోల పాటలు, లాలి పాటలు, బాలల గేయాలు, పిల్లల కథలు మొదలైనవి అందించ దలచుకున్నాము. వాటి మిద మీ స్పందన ఆశిస్తున్నాము.

నాదెండ్ల గ్రామానికి దూరంగా ఉంటున్న వారి కొరకు ఒక కార్యక్రమాన్ని తలపెట్ట దలచాము. మీ పుట్టిన రోజు, పెళ్లి రోజు వంటి శుభకార్యాల సమయంలో లేదా మీరు కోరుకున్న సమయంలో గ్రామంలోని మీ ఇష్ట దైవానికి అభిషేకం, పూజ, ప్రసాదం వంటివి మీ పేరు మీద జరిపించ గలము. దీని కొరకు మీరు ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేదు. కొద్ది రోజుల ముందు మీ వివరాలు అనగా పేరు, గోత్రం తెలియ జేస్తే చాలు.

మరొక కార్యక్రమము ఏమంటే, మన బ్లాగ్ ద్వారా మీ అందరికీ పుట్టిన రోజు, పెళ్లి రోజు, మరియు సందర్భాను సారంగా శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నాము.ఆసక్తి ఉన్నవారు మీ వివరాలు తెలియజేయగలరు. మీ అందరిని ఒక వేదిక పైకి తేవటమే దీని ఉద్దేశం.బిడ్డలను చూసి గ్రామం ఆనందించాలి. గ్రామాన్ని చూసి బిడ్డలు ఆనందించాలి.

సదా మీ సేవలో...
కుమార స్వామి, శ్రీనివాసరావు .


Note: This post is published from 'CITY INTERNET AND CELL WORLD', KALAMANDIR CENTER, CHILAKALURIPET.

No comments:

Post a Comment