Saturday, April 30, 2011
శివాలయం నందు జరుపబడే ముఖ్య ఉత్సవాలు
- నవరాత్రి ఉత్సవాలు: ప్రతి సంవత్సరం విజయ దశమి పండుగ సందర్భంగా నవరాత్రులను, గర్భ గుడిలోని అమ్మవారికీ, బాల త్రిపుర సుందరి అమ్మవారికీ ఘనంగా నిర్వహిస్తారు. విజయదసామీ నాడు స్వామి వారి పార్వేట ఉత్సవం నిర్వహించబడును.
- కార్తీక పౌర్ణమి : కార్తీక మాసమందు ప్రతి రోజు స్వామి వారికి అభిషేకాలు జరుపుతారు. కార్తీక పౌర్ణమి నాడు అఖండాలు స్వామి వారికి సమర్పిస్తారు.
- ఆరుద్రోత్సవాలు( శివ ముక్కోటి): ధనుర్మాసంలో ఆరుద్ర నక్షత్రం నుండి 5 రోజులపాటు ద్వార దర్శనము, గ్రమోత్సవము, అధ్యయన ఉత్సవాలు జరుగును.
- ధనుర్మాసంలో స్వామి వారిని ప్రతి రోజు పల్లకిలో ఊరేగిస్తారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు వైభవంగా జరుగుతాయి. స్వామి వారిని బండి పై అలంకరించి భక్తులు స్వయంగా లాగుతారు.
- మహా శివరాత్రి: కార్తీక పౌర్ణమి నాడు అఖండము చేల్లించుకొనుటకు వీలు పడని భక్తులు మహా శివరాత్రి నాడు చెల్లించుకుంటారు.
- స్వామి వారి రధోత్సవము: వైశాఖ చతుర్దశి నాడు స్వామి వారి కళ్యాణం జరుగును. పౌర్ణమి నాడు రధోత్సవం జరుగును. రధోత్సవం నాడు శివాలయమునకు ఎదురుగ ఉన్న రధశాల లోని రధమును బయటకు తీసి వినాయకుని గుడి కి వెళ్ళే దారి వైపు ఉంచుతారు. స్వామి వారిని రధం పై అలంకరించి రధమును భక్తులందరూ లాగుతారు. రధం లాగుటకు పెద్ద పెద్ద గొలుసులు ఉపయోగిస్తారు. వీటిని మద్రాసు నుండి తెప్పించారని పెద్దలు చెబుతారు. పూర్వ కలం లో రధమును వినాయకుని గుడి వరకు తీసుకు వెళ్ళే వారు. కానీ నేటి కాలంలో అది సాధ్య పడక స్వామి వారి వసంతోత్సవమును వినాయకుని గుడి వద్ద జరుపుతున్నారు.
- ఆలయ ప్రత్యేకత: నిత్య బిందె తీర్ధము, త్రికాలార్చన, సందె మేళము, అఖండ దీపారాధన, సాయంకాల భజన, సంవత్సరం పొడవునా నిర్వహించ బడతాయి.
Monday, April 25, 2011
మహాభినిష్క్రమణం
I have come to light the lamp of Love in your hearts, to see that it shines day by day with added luster. I have not come on behalf of any exclusive religion. I have not come on a mission of publicity for a sect or creed or cause, nor have I come to collect followers for a doctrine. I have no plan to attract disciples or devotees into my fold or any fold. I have come to tell you of this unitary faith, this spiritual principle, this path of Love, this virtue of Love, this duty of Love, this obligation of Love. 4 July 1968, Baba
Friday, April 22, 2011
Good Friday

నాదెండ్ల గ్రామంలో 17-04-11(ఆదివారం) న మట్టల ఆదివారాన్ని క్రైస్తవ మతస్తులు ఘనంగా నిర్వహించారు. ఈత మట్టలు చేతబూని ప్రార్ధన గీతాలు ఆలపిస్తూ వీధుల వెంట ఊరేగింపు నిర్వహించారు.
గ్రామంలో భారీ వర్షం 22-04-2011
22-04-2011 ( శుక్రవారం) నాదెండ్ల, చిలకలూరిపేట, నరసరావుపేట పరిసర ప్రాంతాలలో తెల్లవారు జామునుండి ఉదయం 9.౦౦ గంటల వరకు వర్షాలు కురిసాయి.
Wednesday, April 20, 2011
హాస్టల్ ను సందర్శించిన శాసన సభ్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు
A.P.S.W. హాస్టల్ నందు జరిగిన ప్రతిభావంతులైన విద్యార్ధులకు మెడల్స్, షీల్డ్స్ అందజేసే కార్యక్రమానికి స్థానిక శాసన సభ్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు హాజరైనారు. కీర్తి రూరల్ డెవలప్ మెంట్ అండ్ సోషల్ సర్వీసు సొసైటీ వ్యవస్థాపకులు శ్రీ మద్దుల వెంకట కోటయ్య ( చిలకలురిపేట) గారు ప్రతిభావంతులైన విద్యార్ధులకు మెడల్స్, షీల్డ్స్ అందజేయటం తో పాటు ప్రతి హాస్టల్ విద్యార్ధికి చెప్పుల జతలను అందించారు.
MLA గారు మాట్లాడుతూ హాస్టల్ అవసరాలైన డార్మెటరి నిర్మించుటకు కావలసిన నిధులు మంజూరుకు ఆలోచన చేయగలనని అయన హామీ ఇచ్చారు. విద్యార్ధులు హాస్టల్ లో కల్పిస్తున్న వసతులను చక్కగా వినియోగించుకొని, మంచి విద్యా బుద్ధులు నేర్చి అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
డిస్ట్రిక్ట్ హాస్టల్ వెల్ఫేర్ఆఫీసర్ శ్రీమతి శోభా రాణి గారు మాట్లాడుతూ, హాస్టల్ ను మోడల్ హాస్టల్ గా తీర్చి దిద్దుతున్న వార్డెన్ శ్రీ రాజా బాబు గారిని అభినందించారు. కార్యక్రమంలో sarpanch srimati davala narasamma garu, నాదెండ్ల మండల M.E.O. శ్రీ M.V. సుబ్బారావు గారు, పంచాయత్ సెక్రటరీ శ్రీ పాల్ గారు తదితరులు పాల్గొన్నారు.
అన్నదాతకు కష్టాలు మిగిలిస్తున్న ప్రకృతి వైపరీత్యాలు
ఈ సంవత్సరం అన్నదాతకు కష్టకాలంగా ఉంది. ఎక్కువ మందికి నష్టం తప్పేలా లేదు. బహు కొద్ది మందికి మాత్రమే పెట్టిన పెట్టుబడి వరకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పోస్టింగ్ ఇచ్చే సమయంలో రాత్రి పుట కొద్దిగా చినుకులు పడుతుండటం తో, రైతులు చేలకు వెళ్లి, మిరప కల్లాలు తడవకుండా జాగ్రత్త పడుతున్నారు. పంట చేతికి అంది వస్తున్న ఈ తరుణం లో ఆకాశం మేఘావృతం కావటం, చినుకులు రాలడం ఆందోళనకు గురి చేస్తుంది.
Sunday, April 17, 2011
శ్రీ రామ నవమి - మూడవ రోజు- చిలకలూరిపేట -14-04-2011
Thursday, April 14, 2011
Wednesday, April 13, 2011
Tuesday, April 12, 2011
శ్రీ రామ నవమి శుభాకాంక్షలు!
నాదెండ్ల ఆన్ లైన్ వీక్షకులకు శ్రీ రామ నవమి శుభాకాంక్షలు!
నాదెండ్ల సమీపంలోని చిలకలూరిపేట లో శ్రీ రామ నవమి సందర్భంగా ఏర్పాటు చేసిన పందిళ్ళ దగ్గర సందడి...
గ్రంధాలయం బజార్ లోని పందిరి.




చలివేంద్రం బజార్ లోని పందిరి



పెద్దరధం దగ్గర ఏర్పాటు చేసిన ప్రభ

పెద్ద బజార్ దగ్గర ఏర్పాటు చేసిన పందిరి


కోమల విలాస్ సెంటర్ నందు ఏర్పాటు చేసిన పందిరి.


Subscribe to:
Posts (Atom)