Monday, August 1, 2011

చెలం కొండలు - 2 వ భాగం

చెలం కొండలలో ఇప్పటికీ ఉన్న గుడివాగు తూముకు ఒక ప్రత్యేకత ఉంది. కొండవీటి కోటకు నాదెండ్ల గ్రామము ఒక ముఖ ద్వారము వంటిది. ఎవరైనా కోటకు వెళ్ళాలంటే ఇక్కడ నుండే అనుమతి తీసుకోవాలి. ఏదైనా అత్యవసర పరిస్థితులలో కోటకు బురుజులా ఉన్న గుడివాగు తూము నుండి కోటకు సంకేతాలు పంపేవారు.



క్రీ.. 11 శతాబ్ద కాలంలో అద్దంకి సీమకు చెందిన కాటం రాజు ప్రాంతంలో కొంత కాలం గడిపిన ఆధారాలు ఉన్నాయి. ప్రాంతంలో నీటి వసతి బాగా ఉంది కాబట్టి తన ఆవుల మందలను ప్రాంతంలో ఉంచాడు. చెలం కొండలలో దక్షిణం వైపు ఉన్న కొండ పై భాగాన వీర భద్రుని గుడి కట్టించి పూజలు జరిపే వాడు. పురాతన కాలంలో యుద్ధానికి వెళ్ళే ముందు వీర భద్రునికి పూజలు జరిపే వారు. తర్వాత కాలంలో ముస్లింల దండ యాత్రలో ఆలయం ధ్వంసమైన ఆనవాళ్ళు స్పష్టంగా కనిపిస్తాయి. పడవేసిన రాతి స్తంభాలు, రెండు ముక్కలుగా ఉన్న వీర భద్రుని విగ్రహం నేటికి ఉన్నాయి.

అరణ్యవాస సమయంలో శ్రీ సీతారామలక్ష్మణులు ఇక్కడ కొంతకాలం గడిపారని, ఇక్కడ ఉన్న దొనలోని నీటిని వారు వాడే వారని భక్తుల నమ్మకం. ఇక్కడ కొండపై సీతమ్మ వారి అడుగులు ఉన్నాయి. క్రీ.. 15 శతాబ్ది కాలంలో కొండ పడమటి చీఫ్స్ అనబడే సామంత రాజులు చెలం కొండలు ప్రాంతాన్ని కేంద్రం గా చేసుకొని, నాదెండ్ల చుట్టుపక్కల ఉన్న 40 గ్రామాలను పరిపాలించారని The Forgotten Chapters Of Andhra Pradesh గ్రంధం లో వివరంగా ఉంది. మధ్య కాలంలో చెలం కొండల ప్రాంతంలో కొన్ని కట్టడాలు వాటికీ సంబంధించిన ఇటుకలు బయట పడ్డాయి. పురావస్తు శాఖవారు అంతగా పట్టించుకోకపోవటంతో ఆధారాలు మరుగున పడి పోయాయి.

No comments:

Post a Comment