Friday, August 12, 2011

ప్రధమ వార్షికోత్సవ సమీక్ష - 1 వ భాగం

నాదెండ్ల ఆన్ లైన్ ప్రారంభింపబడి ఒక సంవత్సరం(16-జూలై-2011) పూర్తి చేసుకున్న సందర్భంగా బ్లాగ్ ఉద్దేశం, పోస్టింగ్స్ ఇచ్చే పద్దతి, లోటు పాట్లు, మీరు చూపించిన అభిమానం, మాకు ఇచ్చిన సపోర్ట్ గుర్తు చేసుకుంటూ సమీక్ష...!

స్థాపన లో ఉద్దేశం:
అతి పురాతనమైన సంస్కృతీ, సంప్రదాయాలు వారసత్వం మరుగున పడిపోకుండా ముందు తరాల వారికి అందించాలని, దేవాలయాలలో నిర్వహించే ఉత్సవాలు వాటి అంతరార్ధం అందరికి తెలియజేయాలని, ప్రవాసీలకు గ్రామానికీ మధ్య వారధిగా ఉండాలనే ఉద్దేశంతో అప్పటి మా పాఠశాల (CD స్కూల్, అంబేద్కర్ నగర్) ప్రధానోపాధ్యాయులు S.S.R. (S.శ్రీనివాస రావు) సహకారంతో ప్రారంభింపబడింది.

మన గ్రామం దేవాలయాలకు నెలవు. ఆయా దేవతల ఫోటోలు తీయాలంటే ధర్మకర్తల అనుమతి తీసుకోవాలి. ఆగమ శాస్త్ర నిపుణుల సలహా తీసుకోవాలి. విత్రతకు భంగం కలుగరాదు. మొదటగా మా ఉద్దేశం గురించి నటరాజేశ్వర రావు గారిని సంప్రదించగా అయన ఎంతో సంతోషించి, తనకు అంబాటులో ఉన్న సమాచారం ఇచ్చి, గ్రామానికి సంబంధించిన కొందరు వయో వృద్ధుల పేర్లు సూచించి వారిని కలవమని చెప్పారు. విషయంలో తన పూర్తి సహకారం అందిస్తానని, శివాలయానికి సంబంధించిన చరిత్ర వివరించి, ఫోటోలు తీసుకోమని చెప్పారు. అనంతరం శంభుని పాలెంలో , ఉన్న శ్రీ కోదండ రామస్వామి ఆలయ కమిటీకి చెందిన నెల్లూరి శేఖర్ ను కలవగా వారు కూడా ఆలయానికి సంబంధించిన వివరాలు, ఫోటోలు ఇచ్చి తమ పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. గోవర్ధన స్వామి గుడికి సంబంధించి శ్రీ నల్లమోతు వెంకటేశ్వర్లు గారు, శ్రీ పరాంకుశం అంజనేయాచార్యులు గారిని కలువగా వారు ఆలయ చరిత్ర, గ్రామ విశేషాలు చెప్పి ఫోటోలు బ్లాగ్ లో పెట్టుటకు అనుమతి ఇచ్చారు.

గాంధేయ గట్టు పై ఉన్న శ్రీ సీతారామ స్వామి వారి దేవస్థానానికి సంబంధించిన వివరాల కొరకు ఆలయ ధర్మకర్త , ఆగమ శాస్త్ర పండితుడు శ్రీ పండా వెంకటప్పయ్య గారిని కలిసి బ్లాగ్ ఉద్దేశం వివరించి, వారి అభిప్రాయం కోరగా, మీరు చేస్తున్న పని మంచిదేనని, దేవుని ఫోటోలు తియుటలో తప్పు లేదనీ, గ్రామంలోని ప్రధాన దేవాలయాలలో గతంలోనే ఫోటోలు తీసిన సందర్భాలున్నాయని, మంచి పనిని ఆలస్యం చేయవలదనీ, బ్లాగ్ ప్రారంభించుటకు ముహూర్తం నిర్ణయించారు.

ఇప్పుడు అతి ముఖ్యమైన పని మిగిలి ఉంది. గ్రామానికి నేను కొత్త. ఎక్కడ, ఏమది ఉన్నాయో తెలియదు. గ్రామంలో పురాతన విషయాలు ఎవరికి తెలుసో నాకు తెలియదు. సమయంలో నాకు వేములపల్లి శ్రీరంగం గారు తటస్థ పడగా విషయాన్ని ఆయనకు వివిరించటం జరిగింది. ఆయన నాకు సహాయం చేస్తానని చెప్పారు. రోజు నుండి దాదాపు నెలన్నర పాటు నాకు గైడ్ లాగా వ్యవహరించారు. ఒక విషయానికి సంబంధించిన సమాచారం సేకరించాలని ఆయనతో చెప్పగా, తను విషయం గురించి విచారించి, ఆయా వ్యక్తుల దగ్గరకు తీసుకొని వెళ్ళేవారు. గ్రామంలోని వివిధ శిలా విగ్రహాలు, చలం కొండలు, తాత కొండ, గ్రామ దేవతల గుళ్ళు, గంగమ్మ గట్టు మొదలైన ప్రాంతాలకు తీసుకెళ్ళారు. పని కొరకు తన సొంత పనులు సైతం మానుకున్నారు. విషయంలో వివిధ వర్గాలకు చెందిన సుమారు వంద మందిని కలవటం జరిగింది. వారిలో నిరక్ష్యరాశ్యులు ఎక్కువ మంది. వారు కంప్యూటర్ గురించి, నెట్ గురించి మాత్రం అవగాహన లేని వారు. వారికి విషయమంతా వివరించి, వారి వద్దనుండి కావలసిన సమాచారం సేకరించటం జరిగింది.
to be continued...

No comments:

Post a Comment