Tuesday, August 30, 2011

దేశమంతా పాపం పెరిగి పోతావుంది!!

సాయంత్రం 7.30, వర్షం తుంపరగా పడుతుంది. తిమ్మాపురం దగ్గర నాదెండ్ల రావడానికి ఆటో కొరకు కొంతమంది
ఎదురుచూస్తున్నారు. కొద్దిసేపటికి ఆటోవచ్చింది. అందరు ఆటోలో సర్దుకొని కూర్చున్నారు.గుంటూరు నుండి
వచ్చేవాళ్ళు, పేట నుండి ఇంకా సొంత పనుల మీద వివిధ ప్రాంతాలకు వెళ్లి వస్తున్నవారు. ఆటోలో సంభాషణ
మొదలయ్యింది.

గుంటూరు నుండి బోయపాలెం వరకు వర్షం బాగా కురిసింది. పేటలో ఎలా ఉంది?
పేటలో కూడా బాగానే పడింది.
మార్టూరులో కూడా బాగానే పడింది.
ఇంతకీ మన ఊళ్ళో ఎలా పడిందో
మన ఊళ్ళో పెద్దగా పడలేదంట. ఒక జల్లుపడి ఆగిపోయిందట.
చుట్టూ వాన బాగానే పడుతుంది. మన ఊరికి మాత్రం అంతగా పడట్లేదు.17 సంవత్సరాల తర్వాత నీళ్ళుపోసి పడి
విత్తనాలు వేసాం.
అవున్రా ఊళ్ళో పాపం పెరిగిపోతుంది.అందుకే వాన పడట్లేదు.
అరే పాపం లేనిదెక్కడరా!? దేశమంతా పాపం పెరిగి పోతావుంది.
అదేంకాదులే చలం కొండలు కొట్టుకొని వెళుతున్నారు.అందరం చూస్తున్నాం. ఇదేంటి అని అడిగే నాధుడు లేడు.చలం
కొండలు దేవుడి కొండలు.అందుకేరా నాయనా ఇట్లా అవుతుంది.
అవును నిజమేరా! మునులు తిరుగుతుంటే చూసిన వాళ్ళుకూడా ఉన్నారట. మా చిన్నప్పుడు చెప్పుకునే
వాళ్ళు.అలాంటి దేవుడి కొండలు కొట్టడం తప్పుకదా.
కాని ఏం చేద్దాం ఎలా జరగాలనుకుంటే అలా జరుగుతుంది. మన చేతిలో ఏం ఉంది.
ఊరు వచ్చింది. ఒక్కొకరు తమ ఇంటి వద్ద ఆటో దిగి వెళ్ళిపోయారు.
... ఈమధ్య కాలంలో ఎక్కువగా వినపడే సంభాషణ ఇది. ..(ఇప్పుడు మన గ్రామాన్ని కూడా వర్షాలు పలకరిస్తున్నాయి!!)

No comments:

Post a Comment