Tuesday, July 6, 2010

మేకల స్వామి

ఎన్నో ఆలయాలు, శిలలు, పూజలు, భజనలు నిత్యం గ్రామంలో దైవ సంకీర్తనం, హిందూ సంస్కృతి సంప్రదాయాలు కనులకు కట్టినట్లు వుండే ప్రాంతం నాదెండ్ల. ఎందరో సిద్దులు, యోగులు, అవదూతలు తిరుగాడిన చోటు గ్రామం. గ్రామం లోనే పుట్టి పెరిగి, గ్రామాన్ని పావనం చేసిన మహనీయుడు శ్రీ మేకల స్వామి వారు. వారి చరిత్రను ఒక సారి తెలుసుకుందాం.

నాదెండ్ల గ్రామానికి చెందిన శ్రీ మేకల కోటయ్య, వెంకట లక్ష్మమ్మ గారి కుమారుడు మేకల స్వామి. ఈయన చిన్న తనం నుండి గ్రామం లోని బ్రాహ్మణ కుటుంబం దగ్గర జీతానికి ఉండి అరక దున్నటం, పశువులు కాయటం వంటివి చేసేవారు. ఒక రోజు కుటుంబం వారు గురోపదేశం తీసుకొనుటకు ఏర్పాట్లు చేసుకొంటుండగా వారినుండి వివరాలు తీసుకున్నారు. గురోపదేశం అందరికీ ఇవ్వరని అది అత్యంత రహస్యమైన విషయమని వారి నుండి తెలుసుకున్నాడు. ఎలాగైనా గురోపదేశం ఎలా ఇస్తారో తెలుసుకోవాలని, వారు గురోపదేశం తీసుకొనే సమయాన చాటుగా గమనించి గురు మంత్రాన్ని మనసులో గుర్తుంచుకొన్నారు.
ఆనాటి నుండి ఆయన ప్రతి రోజు నిష్టగా గురు మంత్రాన్ని ధ్యానించుట వలన ఒక విధమైన శక్తి పొందారు. పొలం వెళ్లి అరక కట్టి వదిలితే ఎద్దులు అవే దున్నేవి. పశువులు మేత మేయకుండానే నేమరువేసేవి. గ్రామం లోని చలం కొండల్లో ఎందఱో మునులు తపస్సు చేసుకుంటున్నారని అందరు అనుకుంటారు. మేకల స్వామి చలం కొండల్లోకి వెళ్లి మూడు రోజులపాటు తపస్సు చేసుకొని ఇంటికి తిరిగి వచ్చారు. కొన్ని రోజుల తరువాత శ్రీ స్వామి వారు దారిని వెళ్తుండగా ఒక కమ్మరి కొలిమి దగ్గర ఒకరు ఆపి మూడు రోజులపాటు కొండల్లో తిరిగి ఏమి సాధించావు అని ఎగతాళిగా మాట్లాడగా కొలిమిలో ఎర్రగా కాలిన ఒక ఇనుప బద్డెను చేతితో బయటకు తీసి రెండు ముక్కలుగా విరిచి అక్కడ పడవేసి ప్రశాంతంగా వెళ్లి పోయారు. చర్యతో స్వామి వారి శక్తి చూసిన గ్రామస్తులు వారి ఎడల ఎంతోభక్తీ తో వున్నారు. జ్ఞాన అన్వేషణలో తృప్తి పొందని శ్రీ స్వామి వారు ప్రకాశం జిల్లా త్రిపురాంతకం అనే గ్రామంలో శ్రీ నాసర్ మొహమ్మద్ అనే గురువు దగ్గర ఉపదేశం పొంది, గురుసేవ చేసుకొని గురువుగారి అనుమతితో స్వగ్రామానికి తిరిగి వచ్చారు. కొంత కాలం గ్రామంలో గడిపిన మీదట గ్రామంలో మఠం ఏర్పాటు చేసుకుంటానని గ్రామా పెద్దలతో తెలుపగా, వారు తమ అసక్తతను వెల్లడించారు. స్వామివారి శక్తి దేశానికీ తెలియాలంటే గ్రామం విడిచి వెళ్ళాలని దైవ నిర్ణయం కాబోలు. తర్వాత కాలంలో స్వామి వారు గ్రామం విడిచి వెళ్తూ, గ్రామంలో ఒక అంతరం ఏర్పాటు చేసారు. కరువు కాటకాలు సంభవించి వర్షం పాడనప్పుడు ఏడు రోజులు లేదా, తొమ్మిది రోజులు ఆంత్రం చుట్టూ ఎనిమిది అడుగుల వైశాల్యంలో కట్ట వేసి నీటిని నింపిన, భూమి లోపల ప్రతిష్టించిన ఆంత్రం తడిచినప్పుడు వర్షం పడుతుందని చెప్పి, ఆంత్రం గుర్తుగా భూమిపై ఒక రాయిని నిలిపి గ్రామం వదిలి దేశాటనకు వెళ్ళినారు. మేకల స్వామి దేశాటన చేస్తూ, కర్నూలు జిల్లా, కోవెల కుంట తాలూకా, గుంటిపాపల గ్రామం వద్దకు చేరు కున్నాడు. గ్రామా సమీపం లోని ఒక దరి వద్ద కూర్చొని వుండగా, అనేక మంది ప్రజలు రోదిస్తూ గ్రామంలోకి వెళ్తున్నారు. అటువైపు వెళ్తున్న ఒక ముసలమ్మను పిలిచి, ఎక్కడికి వెళ్తున్నారు అనగా, సమీపం లోని మూడు గ్రామాలకు పెద్దగ వ్యవహరించే కపుకు ఒక్కడే కొడుకని, అయన పాము కరిచి చనిపోయాడని, ఏంటో మంచి వాడని చెప్పింది. నేను వెళ్లేసరికి అంత్యక్రియలు పుర్తవుతఎమోనని ఆయాసపడుతూ చెప్పింది. మాట విన్న స్వామి, అమ్మ! అబ్బాయి చనిపోలేదు, నేను నీకు కర్రపుల్ల ఇస్తాను. అది తీసుకోని వెళ్లి దానిని సాది నీటిలో కలిపి బాబు నీటిలో పోయండి అని తన వద్దనున్న చిన్న చెక్క పుల్లను ఇచారు. ముసలమ్మ ఆదరాబాదరాగా పడుతూ లేస్తూ గ్రామంలోకి వచ్చింది. ఆమె వచ్చే సమయానికి పాడె ఎత్తి తీసుకుపోవటానికి బయలుదేరగా, ఆమె అడ్డు వచ్చి తనకు ఎవరో మహనీయుడు వచ్చే దారిలో కొండల్లో కనిపించి ఒక చెక్క ఇచాడని, దానిని కరిగించి బాబు నోటిలో పోయమన్నాడని, బాబు బ్రతుకుతాడని చెప్పాడని వారితో చెప్పగా పాడెను దించి, కట్లు విప్పదిసి, ముసలమ్మా చెప్పినట్లు చేయగా, పాము కరిచిన భాగం నుండి విషం బయటకు కరి, కొద్ది సమయానికి బాబు లేచి కూర్చున్నాడు. అక్కడ ప్రజలంతా ఆశ్చర్యపోతూ ఆనందంతో ముసలమ్మను వెంటబెట్టుకొని మేళ తాళాలతో స్వామి వారి వద్దకు వచ్చి ఆయనను ఘనంగా గ్రామంలోకి తీసుకోని వెళ్లి ఆశ్రయం ఏర్పాటు చేసినారు. ( విషయం అవ్వగారి శేషగిరి గారు మూడు సంవత్సరాల క్రితం నాతో చెప్పినారు.) కొంత కాలం గడిచిన పిమ్మట శ్రీ స్వామి వారు ఆశ్రమం నిర్మించాలని ఆలోచన తలపెట్టగా భక్తులు 20 ఎడ్ల బండ్లను కట్టుకొని రాయి కొరకు సమీప ప్రాంతంలోని కొండల వద్దకు వెళ్ళినారు. వారి వెంట స్వామి వారు కూడా ఉన్నారు. వారు అందరు బండ్ల నిండా రాయి ఎత్తుకొని తిరిగి వచ్చేటప్పుడు వచ్చే దారిలో పెద్ద వాగూ అడ్డు వచ్చింది.(పై ప్రాంతం లో వర్షం కురియుట వలన తాత్కాలికంగా ఏర్పడిన ప్రవాహం). ఉధృతంగా ప్రవహిస్తున్న్ వాగును భక్తులు బండ్లను అపివేయగా వెనుక బండి వద్దనున్న స్వామివారు ముందుకు వచ్చి విషయం తెలుసుకోగా వాగు ఇంత ఇదిగా పారుతుంటే ఎలా వెళ్ళడం అని ప్రశ్నించారు.అప్పుడు స్వామివారు "మీరు అధైర్య పడకండి, నేను ముందు వాగులోకి వెళతాను , నా వెనుకనే మీరు రండి, కాని అందరు ఒడ్డు చేరే వరకు ఎవరు వెనుదిరిగి చూడరాదని " చెప్పి వాగులోకి దిగగా వాగూ రెండుగా చిలి వారందరికి దారి ఇచ్చింది. అందరు క్షేమంగా ఒడ్డు చేరుకున్నారు. శ్రీ వారు ఆశ్రమం నిర్మించుకున్న తర్వాత అనేక మంది భక్తులు వచ్చి, ఆయనను సేవించుకుంటూ ఉండేవారు . కాలం లో సమీప గ్రామంలో కాలంలో ఒక మోతుబరి rసంతానం లేక అల్లడుచున్ స్వామి న్నాడు స్వామి వారి గురించి విని దర్శించుకొని స్వామి వారి సేవ వారికీ. సంతానం ప్రప్తించినది విధముగా. విధముగా కోవేలకుంట తాలూకా పరిసర ప్రాంతములో స్వామి వారు ఏంటో ప్రసిద్ది వాగులోకి. ఉండేవారు వారు జీవ సమాధి సమీప ఆలోచనతో గుంతిపాపల గ్రామంలోని తన ఆశ్రమంలో సమాధి నిర్మిమ్చుకోగా, ఆయన తల్లి వెంకట లక్ష్మమ్మ గారు తనకు కొద సమాధి నిర్మించమని కోరింది. ఆమెకు కూదా సమాధి నిర్మించి , అక్కడే సమాధి చేసారు. ఈయన సమాధి పొందే సమయానికి, ఆయన గురువుగారు శ్రీ నాసిర్ మొహమ్మద్ గారు పిలిపించి తనతో పాటు శ్రిత్రిపురంతకంలో జీవ సమాధి పొందమని ఆజ్ఞాపించారు. గురువు గారి ఆజ్ఞ మేరకు 1895-1904 మద్య కాలంలో ఒక కార్తీక కార్తీక మాసం బహుళ పంచమి నాడు స్వామి వారు జీవ సమాధి పొందారు. నిస్తతో భగవంతుని ధ్యానం చేసే ఎలాంటి యోగుల గురించి తెలుసుకోవటానికి , "ఒక యోగి ఆత్మ కథ " పుస్తకం లో మరిన్ని వివరాలు కలవు. శ్రీ మేకల స్వామి వారు సమాధి చెందేతప్పటి వయస్సు సుమారు 90 సంవత్సరాలు ఉండొచ్చని అంచనా. అయన పేరు మీద గుంటిపాపల గ్రామంలో ఐదు ఎకరాల భూమి, 75 సెంట్ల స్థలాన్ని గ్రామస్తులు 1894, 1903, 1904 సంవత్సరాలలో రిజిస్ట్రేషన్ చేసిన వొరిజినల్ డాక్యుమెంట్లు (8 అణాలు , 8 అణాలు , 1 రూపాయి ) నేను చూసాను . దీనిని బట్టి ఆయన 1810-20 సంవత్సరాల మద్య కాలంలో జన్మించి ఉంటాడని అంచనాకు వచ్చాను. శ్రీ స్వామి వారి గురించి నాకు సమాచారం ఇచ్చినది అయన ముని మనవడు జెట్టి ఆంజనేయులు గారు. అంటే కాదు సుమారు 4 సంవత్సరాల క్రితం కీ.సే. నల్లమోతు శేషగిరి రావు గారు ( కుమ్మరి సైదులు) కుమ్మరి సైదులు నాటో ఆత్యాద్మిక విషయాలు ముచ్చటిస్తూ మేకల స్వామి వారి గురించి చెప్పారు. ఆయన గుంటిపాపల ఆశ్రమాన్ని, స్వామి వారి సమాధిని దర్శించి వారి గురించి పరిచయమున్న కొద్దిమందితో మాట్లాడానని తెలిపారు. నేను మీకు తెలిపిన ప్రతి ఆక్షరము సత్యమని నమ్ముతూ , ఎందఱో మహనీయులు నడిచిన గడ్డమీద జన్మించినందుకు మీకు, ఉంటున్నందుకు నాకు, తెలుసుకుంటున్న అందరికి అభి నందనాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.
కుమ్మరి సైదులు : కర్నూలు జిల్లా , యాగంటి కొండలు.
మనము ఇంతకూ మునుపు తెలుసుకున్న మేకల స్వామి వారికీ సంతానం లేకపోవుటచే తమ్ముడి కొడుకైన కోటయ్యను పెంచుకున్నారు. ఆయనకు ముగ్గురు ఆడ పిల్లలు. వారిలో ఒకరి కుమారుడు కుమ్మరి సైదులు .ఆయన తన బాల్యాన్ని నాదెండ్ల గ్రామంలోనే గడిపినాడు. ఆయనతో కలసి తిరిగిన వారు గ్రామంలో ఇప్పటికీ చాల మంది ఉన్నారు. మేకల స్వామి వలె గురూపదేసం పొంది, గురువు వద్ద సాధన చేసి గురువు అనుమతి లేకుండా శక్తులు ప్రదర్శించి, గురువు గారి ఆగ్రహానికి గురై దుర్మరణం పాలైన వ్యక్తి కుమ్మరి సైదులు గారు. వారి గురించి తెలుసుకుందాం.


కుమ్మరి సైదులు గారు మేకల స్వామి వారి ఆశ్రమంలో గడుపుతూ స్వామి వారి రుద్రాక్షమాలను ధరించేవారు. ఆయన కర్నూలు జిల్లా లోని యాగంటి కొండలలో ఒక గురువు గారి వద్ద దీక్ష తీసుకున్నారు. కొంత కలం పటు గురువు వద్ద సేవ చేసినారు. పూర్వ జన్మ సుకృతం వల్ల, గురుకృప వలన వీరికి కొన్ని శక్తులు త్వరగానే అబ్బినవి. ఒక నాడు గురువు గారి అనుమతి లేకనే నాదెండ్ల గ్రామానికి వచ్చినాడు. గ్రామంలో తన ఇంటిలో కొంత కాలము బస చేసినాడు. సమయంలో గ్రామంలోని తన మిత్రుల వద్ద శక్తులు ప్రదర్శించారు . గ్రామంలోని ఒక వ్యక్తి కి సంతానం లేక పోవుటచే సైదులు గారిని ఆశ్రయించగా , తను ధరించిన రుద్రాక్షమాలలో ఒక రుద్రాక్షను తీసి మంత్రించి ఇవ్వగా ఆయనకు సంతానం ప్రాప్తించినది.

మరల తన గురువు గారి పిలుపు మేరకు యాగంటి కొండలకు వెళ్ళినాడు. తన అనుమతి లేకనే శక్తులు ప్రదర్సిన్చినదని తెలుసుకున్న గురువు గారు తీవ్ర ఆగ్రహం చెంది, తన శిష్యులచే ఆయనను దండించి, భ్రష్టుడవు కమ్మని శపించారు. గురు శాపం, తిరస్కారం పొందిన అయన వికల మనస్కుడై గాయాలతో ఏదో విధంగా గుంటిపాపల లో ఉన్న మేకల స్వామి వారి ఆశ్రమాన్ని చేరుకొని తన వారికి కబురు చేసాడు. నాదెండ్ల నుండి వారి బంధువులు వెళ్ళగా జరిగిన విషయం తెలిపి మరణించినారు. ఆయనను మఠం బయట సమాధి చేసినారు.


కుమ్మరి సైదులు గారి సిద్దులను ప్రత్యక్షంగా చుసిన వ్యక్తి కీ.శే. నల్లమోతు శేషగిరి గారు ( అవ్వాగారి శేషగిరి). అయన నాకు చెప్పిన విషయాన్నీ యధాతథంగా మీకు తెలియచేస్తున్నాను. తన మిత్రుడు సైదులు వచ్చారని తెలుసుకొని సాయంత్రం పూట వాళ్ళింటికి వెళ్ళగా బయలుకు పోదామని చెంబు తీసుకోని శేషగిరి గారి చేయి పట్టుకున్నారు. కళ్ళు ముసి కళ్ళు తెరిచే సరికి చలం కొండల్లో ఉన్నారు.కొద్ది సేపు పిచ్చాపాటి మాట్లాడుకొని అదేవిధం గా ఇంటికి వచ్చినారు. కొన్ని రోజుల తర్వాత రాత్రిపూట శేషగిరి గారిని పిలిపించినారు. సైదులు గారు శేషగిరి గారి చేయి పట్టుకోగా క్షణకాలం లో తూబాడు వెళ్ళే డొంక వద్ద ఉన్నారు. కొద్దిసేపు మాట్లాడిన తర్వాత తనకు గురువుగారి పిలుపు అందినదనీ, వెళ్తున్నానని చెప్పి అదృశ్యమైనాడు. తర్వాత సైదులు గారు మరణించినారని శేషగిరి గారు చెప్పినారు.

శేషగిరి గారు ఆధ్యాత్మిక భావనలు మెండుగా ఉన్న వ్యక్తి. యన దక్షిణ భారతదేశంలో ఉన్న చాలామంది గురువులను, సాదు పుంగవులను కలుసుకొని, వారి ఆశీర్వాదం పొందియున్నారు. అందుకే ఆయన మాటలను ప్రామాణికంగా భావిస్తున్నాను.

No comments:

Post a Comment