Monday, July 26, 2010

గురు పౌర్ణమి వేడుకలు 25-7-2010

శ్రీ కముఖల అమర గురు మందిరం:

నాదెండ్ల గ్రామంలోని శ్రీ కముఖల అమరగురు మందిరం ( అమరయ్య స్వామి మఠం) నందు గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో గురు బిడ్డలు ( శిష్యులు) అందరు పాల్గొని అమర గురు వారి సజీవ సమాధికి పూజలు జరిపారు. సజీవ సమాధి చుట్టూ ప్రదక్షిణాలు చేసినారు. ఈ కార్యక్రమం పీఠాధిపతి బూతుకురి నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యం లో జరిగినది. భజన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి ఆశిస్సులు పొందినారు.

శ్రీమద అచల రుషి పూర్ణానంద రాజయోగి సద్గురువు పీఠం:

నాదెండ్ల గ్రామంలో ఉన్న శ్రీమద అచల రుషి పూర్ణానంద రాజయోగి పీఠం నందు గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. భక్తులందరూ పీఠం వద్ద శ్రీ పూర్ణానంద గురువుగారి పాదుకలకు పూజలు జరిపారు. గురు పరంపరలో ప్రస్తుత గురువు శ్రీ కృష్ణానంద దీక్షితయ్య తోట కృష్ణారావు గారు శిష్యుల పూజలు అందుకొని అనుగ్రహ భాషణం చేసినారు. గురు పౌర్ణమి విశిష్టత, గురు శిష్య సంబంధం , జనన మరణ చక్రం నుండి తప్పించుకొనుటకు మార్గం సద్గురువేనని బోధ చేసారు. శ్రీమతి మండవ మాణిక్యమ్మ గారి అధ్వర్యంలో భజన బృందము భజన నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో నల్లమోతు బసవమ్మ, రంగ నాయకమ్మ , నారాయణమ్మ మరియు శిష్య బృందము అధిక సంఖ్యలో పాల్గొని సద్గురు ఆశిస్సులు పొందారు. ( ఈ పీఠం దేవ భక్తుని వారి వీధిలో నున్న నల్లమోతు వెంకట నాగేశ్వర రావు , మాజీ సర్పంచ్, గారి కొష్టం లో ఉన్నది.)
Note : This post is published from Doctor Nallamothu Swamy's House.

No comments:

Post a Comment