Thursday, October 7, 2010

జగన్మాత ఉత్సవాల దృశ్యమాలిక త్వరలో మీకోసం...

నాదెండ్ల ఆన్ లైన్ బ్లాగ్ వీక్షకులకు నమస్కారం! మన గ్రామ ఆరాధ్య దైవం శ్రీ నందికుంట గణపతి స్వామి వారి ఆశిస్సులతో వినాయక చవితి ఉత్సవ విశేషాలను కొన్నింటిని అదే రోజు మీకు అందించటం జరిగింది. మరికొన్ని విశేషాలను నిమజ్జన కార్యక్రమం పూర్తయిన తర్వాత అందించటం జరిగింది. ఈ మొత్తం కార్యక్రమాన్ని మీకు అందించుటలో చేకూరి అమరేంద్ర మనకు ఎంతో సహాయం చేసారు. అదే విధంగా తమ ఇంటర్నెట్ ఉపయోగించుకొనుటకు అనుమతి ఇచ్చిన మన గ్రామ వాస్తవ్యులు డా.నల్లమోతు స్వామి గారికి , కె.కోటేశ్వర రావు మాస్టర్ గారికి ఎంతో కృతఙ్ఞతలు.

వినాయక చవితి ఉత్సవ స్పూర్తితో దసరా పండగ నవరాత్రుల భక్తి కార్యక్రమాలను కూడా మీకు ఎప్పటికప్పుడు అందించాలనే సంకల్పంతో ఉన్నాం. లోకాలను కాపాడే ఆ జగన్మాత ఆశీసులతోదసరా ఉత్సవాలను లైవ్ లో అందించాలని అనుకుంటున్నాము. ఈ కార్యక్రమాలను చూసి ఆనందిస్తారనీ, జగన్మాత ఆశీసులు అందుకుంటారని ఆశిస్తూ......... నాదెండ్ల ఆన్ లైన్ టీం

No comments:

Post a Comment