Sunday, October 31, 2010

అన్నాప్రగడ - చివరి భాగం

శ్రీమతి ఇందిరా గాంధీ భారత ప్రధానిగా ఉన్న కాలంలో అన్నాప్రగడ అధ్యక్షులుగా అఖిల భారత స్వాతంత్ర్య సమర యోధుల సంఘాన్ని స్థాపించి, దానికి అధ్యక్షత వహించారు. సంఘ సమావేశం 1964 అక్టోబర్ 8 నుండి 10 వరకు డెహ్రాడున్ లో జరిపారు. మహా సభల అనంతరం, ఇందిరా గాంధీ భారత స్వాతంత్ర్య పోరాటంలో తమ సర్వస్వాన్ని కోల్పోయిన సమర యోధులకు నెలవారీ పెన్షన్లు, ఇళ్ళ స్థలాలు, ఉచిత ప్రయాణ సౌకర్యాలు కల్పించారు. ప్రత్యేకించి పూణే నగరంలో అన్నాప్రగడ కామేశ్వర రావు గారికి ఇల్లు కూడా కట్టించి పెట్టారు.

శ్రీ కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్య మంత్రి గా ఉన్న కాలంలో అన్నాప్రగడ కామేశ్వరరావు గారిని పిలిపించి గుంటూరు నగరం లో అఖిల భారత విప్లవ కారుల సభ జరిపించమని కోరారు. అందుకు కావలసిన నిధులు తామే సమకూరుస్తామని హామీ ఇచ్చారు. స్వర్గీయ భగత్ సింగ్ తల్లి గారైన విద్యావతి గారి అధ్యక్షతన జరగవలసిన సభ బ్రహ్మానంద రెడ్డి గారు నిధులు సమకూరుస్తామని ఇచ్చిన వాగ్దాన భంగం కారణంగా జరగలేదు.

1985 లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, అన్నాప్రగడ కామేశ్వరరావు ను ఘనంగా సత్కరించినది. కొద్ది రోజుల తరువాత కాలికి ఎదురు రాయి పొడుచుకొని బలమైన గాయం అయినది. షుగర్ పేషెంట్ కావటంతో గాయం మానలేదు. గాంగ్రిన్ సోకింది. 1987 జనవరి 30 తేదిన ఆయన స్వర్గస్తులైనారు. పూనేలో ఆయన అంత్య క్రియలు ముగిసాయి. ఆయన అంత్య క్రియలకు కుటుంబ సుభ్యుల దగ్గర సొమ్ము లేక, ఇంటిలోని పాత కలపను అమ్మి వచ్చిన సొమ్ముతో తంతు నిర్వహించారు.

2002 సంవత్సరంలో దేశవ్యాప్తం గా జరిగిన అన్నాప్రగడ కామేశ్వర రావు గారి శతజయంతి ఉత్సవాలలో భాగంగా నరసరావు పేట లో గూడా సభ ఘనంగా జరిగినది.

విధం గా తన జీవిత సర్వస్వాన్ని భారత మాట దాస్య శృంఖలాలు విడిపించడానికి కృషి చేసిన మహనీయుడు మన గ్రామంలో జన్మించినందుకు ఆనంద పడుతూ, వారి జీవిత చరిత్రను మీ అందరికి పరిచయం చేసే అదృష్టం కలిగినందుకు గర్విస్తూ... జై హింద్!

No comments:

Post a Comment