
సంతోషాల ఆరావళి
మతాబుల ముత్యాల మురళి
తారాజువ్వల కేళి
చిన్నారుల కేరింతల సరళి
చీకటి పాలిట కాళి
ఆనందమౌళి! దీపావళి!!
మతాబుల ముత్యాల మురళి
తారాజువ్వల కేళి
చిన్నారుల కేరింతల సరళి
చీకటి పాలిట కాళి
ఆనందమౌళి! దీపావళి!!
ప్రియమైన వీక్షకులకు దీపావళి శుభాకాంక్షలు..!
చిన్నారుల హడావిడితో దీపావళి కళకళలాడింది. ఋతుపవనాలు, వాయు గుండాల వలన కురుస్తున్న వర్షాలు దీపావళి రోజున (05-06-2010 ) తెరిపి నిచ్చాయి. కొద్దిగా ఎండ కాసింది. పెద్దలకు మందులు కొనటం కష్టం .. మరి పిల్లలకు మందులు కాల్చటం ఇష్టం. చిలకలూరిపేట కు దీపావళి మందులు కొనటానికి వెళ్లారు. పగలంతా తడవకో టపాకాయి, తడవకో చిచ్చుబుడ్డి కాలుస్తూ .. గడిపారు. రాత్రికి సంబరాలు మిన్నంటాయి.
అయితే కురుస్తున్న వర్షాలు యెక్కువై రైతులలో కొంత నిరాశ. రెండు రోజులలో మరో తుపాను హెచ్చరిక. దీనితో పండగ రోజున పెద్దలలో కొంత ఉత్సాహం తగ్గింది.
No comments:
Post a Comment