Sunday, November 14, 2010

నాదెండ్లలో భారీ వర్షం 14-11-10

గ్రామంలో ఉదయం పదకొండున్నర గంటల వరకు ఎండ కాసింది. అయితే తరువాత ఆకాశం మేఘావృతమై జల్లుతో మొదలై సుమారుగా అరగంట సేపు భారీ వర్షం కురిసింది. జాష్టి వారి పాలెం చెరువు మొదలుకొని వినాయకుని గుడి వరకు రోడ్డు కిరువైపులా వర్షపు నీరు ఏరులై పారింది. పల్లపు ప్రాంతంలోని పొలాలలో నీరు నిలిచి పంటకు నష్టం కలిగించేలా ఉంది. రోడ్ల మీద నీరు చేరి రోడ్లు పాడవుతున్నాయి, ప్రయాణానికి ఇబ్బందికరంగా ఉంది.

No comments:

Post a Comment