Monday, January 17, 2011

నాదెండ్ల గ్రామం లో ఘనంగా జరిగిన సంక్రాంతి సంబరాలు

నాదెండ్ల గ్రామం లో సంక్రాంతి పండుగను అందరు ఘనంగా జరుపుకున్నారు .రైతుల పరిస్తితి అంత ఆశాజనకంగా లేకపోయనప్పటికి సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చిన పిల్లలను చూసిన ఆనందంతో పండుగను ఉత్సాహంతో జరుపుకున్నారు.సెలవులకు ఇంటికివచ్చిన విద్యార్ధులు, ఉద్యోగులు తమ పని వత్తిడిని మరచిపోయి హాయిగా తమమిత్రులను కలసుకొని పాతవిషయాలు గుర్తుకు తెచ్చుకొని సెలవులలో సేదతీరారు. గ్రామంలో పండుగ సందర్భంగా వివిధ ఆటలపోటిలను నిర్వహించారు. నల్లమోతు. రాజేంద్ర ప్రసాద్ (రాజా గారు ), గొంది. వీర కోటేశ్వరరావు గార్ల మెమోరియల్ వాలీ బాల్ పోటిలలో యడ్లపాడు R C M టీం మొదటి బహుమతి గెలుచుకోగా, రోండవ బహుమతి నాదెండ్ల చౌదరి యూత్ కైవసం చేసుకుంది. మూడోవ బహుమతి సాతులూరుకి చెందిన చౌదరి యూత్ పొందినది. సత్రం బజార్ గణేష్ యూత్ ఆద్వర్యం లో జరిగిన క్రికెట్ పోటిలలో ఫైనల్ లో మొదటి బహుమతి పవర్ స్టార్ (మాదిగ పల్లె ), రోండవ బహుమతి గణేష్ యూత్ (సత్రం బజార్ ) కైవసం చేసుకొన్నారు.
స్తానిక హరేరామ గుడివద్ద గ్రామానికిచెందిన గణేష్ యూత్ ఆధ్యర్యం లో వివిధ ఆటల పోటీలను నిర్వహించారు.
ముందుగా ముగ్గుల పోటీలను నిర్వహించి న్యాయ నిర్ణేతలుగా నల్లమోతు. ఉమామహేశ్వరి, మండవ. వాణి, నల్లమోతు .సదా లక్ష్మి వ్యవహరించారు. అనతరం మ్యూజిక్ చైర్, టగ్ అఫ్ వార్, (కళ్ళకు గంతలు కట్టి కుండను కొట్టుట)
బైక్ రైస్ స్లో పోటీలను కూడా నిర్వహిచారు దీనిలో ప్రదమ బహుమతి అత్తోటి. లక్ష్మినారాయణ, ద్వితీయ బహుమతి కొడాలి . ఫణికుమార్ పొందారు.
పోటిలలో మహిళలు పిల్లలు యువకులు విరివిగా పాల్గొన్నారు, కార్యక్రమాలను గణేష్ యూత్ తరఫున వేములపల్లి. శ్రీనివాసరరావు, నల్లమోతు. నటరాజ్, గంగవరపు. అశోక్, కక్కెర.అనిల్ నిర్వహించారు.
కార్యక్రమాలను నాదెండ్ల ఆన్ లైన్ నిర్వాహకులు మన్నె. కుమారస్వామి పర్యవేక్షించారు.

No comments:

Post a Comment