Monday, January 24, 2011

నాదెండ్ల ఆన్ లైన్ ద్వారా చేపట్టే కార్యక్రమాల వివరాలు

"నాదెండ్ల ఆన్ లైన్" ద్వారా రాబోవు 4 నెలల కాలములో నిర్వహించనున్న వివిధ కార్యక్రమాలు.
  1. ఫిబ్రవరి నెలలో మనగ్రామ ZP హై స్కూల్ లో విద్యార్ధులు మరియు నాదెండ్ల గ్రామస్తులై ఉండి వేరేపాఠశాల యందు చదువుతున్న 10th క్లాసు విద్యార్ధులకు టాలెంట్ టెస్ట్ (merit scholarship test) తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం లలో నిర్వహించబడును.
  2. వేసవి శెలవులలో గ్రామం లో ఆసక్తి గల వారికి కంప్యూటర్ శిక్షణ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులుఅనుభవం కలిగిన అధ్యాపకులచే నిర్వహించబడును.
  3. 5 నుండి 10 సం.లలోపు విద్యార్ధులకు వేసవిలో శిక్షణ శిభిరము. శిభిరములో విద్యార్ధులకుతెలుగు పాటలు,బొమ్మలు చేయుట,మరియు చిత్ర లేఖనం నందు శిక్షణ ఇచ్చుట. ఆసక్తి కల వారికి సంగీతము పరిచయం చేసి, అన్నమయ్య, రామదాసు కీర్తనలు నేర్పించుట జరుగును.
  4. నాదెండ్ల కు సంభందించిన చరిత్రను సేకరించి గ్రంథస్థం చేయుట. దీనికొరకు అన్ని వర్గాల ప్రజలనుండిసమాచారము సేకరిస్తున్నాము. మనగ్రామ చరిత్రకు సంబంధించిన చిన్న అంశము మీకు తెలిసిన లేక గ్రామ చరిత్ర తెలిసిన వారు మీకు పరిచయం ఉంటే వారివివరాలు మాకు తెలియజేయగలరు.
ఎంతో కష్టసాధ్యమైన కార్యక్రమాలు నిర్వహించాలంటే మీ సహాయ, సహకారాలు ఎంతో అవసరమని మనవి చేస్తున్నాము.
ధన్యవాదాలు,
నాదెండ్ల ఆన్ లైన్ టీం,
"give us feedback@ 9490554384
nadendlaonline@gmail.com,
follow 'nadendlaonline' on twitter.

No comments:

Post a Comment