Wednesday, November 28, 2012

కార్తీక పౌర్ణమి - నాదెండ్ల - దేవాలయాలు 28-11-12

కార్తీక  పౌర్ణమి పురస్కరించుకొని ఈ రోజు తెల్లవారుజామునుండి గ్రామంలోని శివాలయంలో స్వామి  వారికి అభిషేకాది  పూజలు ప్రారంభమయ్యాయి. గ్రామంలోని మహిళలు, అయ్యప్ప స్వాములు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మొదటిగా శివాలయంలో 365 వత్తుల కట్టలు, రుద్రాలతో అభిషేక మండపంలో, జమ్మి చెట్టు కింద ,జిల్లేడు చెట్టు కింద, తులసి కోట దగ్గర, నాగమయ్య విగ్రహం దగ్గర దీపారాధన జరిపారు. తదుపరి వినాయకుని గుడి,  కన్యకా అమ్మవారి గుడిలో, సీతాలమ్మ గుడి , నారాయణ స్వామి మఠం , గోవర్ధన స్వామి గుడి, హరే రామ గుడి, కొండ మీద  గుడి, అమర్య స్వామి మఠం లలో దీపారాధన జరిపారు. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు, చిన్న పిల్లలతో సహా ఆయా ఆలయాలను  దర్శించి పూజలు జరిపారు .
 శివాలయం 
 
 జ్వాలాతోరణం కోసం తాడును సిద్దం చేస్తున్న భక్తులు 

  **************
వినాయకుని గుడి 
 
 గోవర్ధన స్వామి గుడిలో 
 **************
 కొండ మీద గుడి 

 ****************
చల్లని తల్లి - సీతాలమ్మ

No comments:

Post a Comment