Friday, November 23, 2012

నాదెండ్ల సేవా సమితి (NSS ) ఆవిర్భావం 15-11-12

                      నందికుంట విఘ్నేశ్వరుని ఆశిస్సులతో నాదెండ్ల గ్రామ NRI ల ఆశయ  సాధనకు వారధిగా  "నాదెండ్ల సేవా  సమితి (NSS )" ఆవిర్భావం  15-11-12 న జరిగినది. గ్రామాభివృద్ధి కి తోడ్పడటం లో భాగంగా విద్యా ప్రమాణాలు పెంచుటకు సౌకర్యాలు కల్పించుట, పాఠశాలలకు మౌలిక వసతుల ఏర్పాటు ప్రధమ లక్ష్యం గా NSS  ఏర్పడినది. గ్రామ అవసరాలు ,పాఠశాలల అవసరాలను సమీక్షించి  దాతలకు , NRI లకు తెలియజేసి, వారి సహాయ సహకారాలను గ్రామానికి అందించటం NSS  కర్తవ్యం.
 

 ఈ సందర్భంగా తొలుత శివాలయం వీధి లోని పెద్ద బడి నందు బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఆటల పోటిలలో గెలుపొందిన బాలలకు బహుమతులు ఇవ్వడం జరిగినది. 
 
ఆటలలో గెలుపొందిన విద్యార్ధులకు బహుమతులను పెద్ద బడి HM గారికి ప్రాయోజితం చేస్తున్న  NSS సభ్యులు


  
ఈ కార్యక్రమంలో శ్రీ నల్లమోతు జయరాం గారు పాల్గొని పెద్దబడిని సందర్శించారు. పాఠశాల ల ఉపయోగార్ధం రు .15,000/- NSS సభ్యులకు అందజేసారు.ZP   ఉన్నత పాఠశాల కు లేసర్ ప్రింటర్ కొనుటకు ఇందులో కొంత మొత్తము వినియోగించబడుతుంది.   శ్రీ గంగవరపు శ్రీనివాసరావు గారు కూడా  రు.15,000/- అందించియున్నారు.
 

నల్లమోతు జయరాం గారు, డాక్టర్ నల్లమోతు నాసరయ్య గారు, డాక్టర్  నెల్లూరి సత్యనారాయణ గారు, పద్మ గారు,మురళి గారు, వేములపల్లి శివ బాబు గారు, గంగవరపు శ్రీనివాస్ గారు NSS  ఆవిర్భావాన్ని అభిలషించారు.

No comments:

Post a Comment