Sunday, March 6, 2011

జెడ్. పి. పాఠశాలకు పూర్వ విద్యార్ధుల వితరణ



గత 13-02-11 నిర్వహించిన టాలెంట్ టెస్ట్ కార్యక్రమానికి విచ్చేసిన పాఠశాల పూర్వ విద్యార్ధులు శ్రీ నల్లమోతు హరి బాబు గారు, మురళి గారు, శివ రామ్ గారు, సాంబశివరావు గారు పాఠశాలకు లేజర్ ప్రింటర్, మరియు ప్రార్ధన సమావేశాలకు అవసరమైన కార్డ్ లెస్ మైక్ సిస్టం ను అందించగలమని హామీ ఇచ్చారు. వారికి z.p. పాఠశాల సిబ్బంది తరపున మరియు 'నాదెండ్ల ఆన్ లైన్ తరపున హార్దిక ధన్యవాదములు.
పాఠశాల కు విరాళం ప్రకటిస్తున్న శివ రామ్ గారు( ఫోటో లో ఎడమ వైపు చివర సాంబశివరావు గారు, కుడివైపు చివర మురళి గారు.)

1 comment:

  1. అయ్యా! ఇంతటి వితరణ శీలురైన వారికి , వారి వితరణను వెలుగులోకి తెచ్చిన మీకూ అభినందనలు.
    ఐతే అసంపూర్ణ సమాచారం వల్ల నిరుపయోగంగా ఉంది.
    జరిగిన హైస్కూలు ఏ ఊర్లో, ఏ జిల్లలో, ఉందో అన్న విషయం తో పాటు అక్కడి ప్రథాన వ్యక్తులను కూడా కొంచెం ఓపికతో ఇంకా వ్రాసి ఉంటే ప్రయోజన కరంగా ఉండేదని తెలియ చేస్తున్నాను. శుభమస్తు.
    http://andhraamrutham.blogspot.com/

    ReplyDelete