Friday, March 25, 2011

పరీక్షా సమయంలో రణరంగం!!! (25-03-2011)

24-03-2011 అనగా నిన్నటి నుండి పదవ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. విఘ్నేశ్వరుని అశీస్సులందుకొని విద్యార్ధులు చిలకలూరిపేట(గణపవరం) వైపు పరీక్షా కేంద్రాలకు పయన మయ్యారు. నిన్న, రోజు తెలుగు పేపర్ కావడం తో హ్యాపీ గా పరీక్ష రాసారు. రోజు సాయంత్రం నుండి వారి ప్రిపరేషన్ ఊపందుకుంది . రేపు హిందీ ఎక్జాం.


నిన్నే
భారత్, ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ కప్ క్రికెట్ క్వార్టర్ ఫైనల్స్ జరిగింది. భారత్ గెలుపు విశేషం. సమిష్టి కృషికి తోడు యువరాజ్, రైనా లు నిలకడగా ఆడటం తో సెమీస్ లో బెర్తు ఖాయమైంది. కోలాహలానికి తోడు నిన్ననే చిలకలూరిపేట మాజీ M.L.A. శ్రీ మర్రి రాజశేఖర్ గారు జగన్ వర్గం లో చేరుతున్న సందర్భంగా సభ ఏర్పాటు చేయటంతో N.R.T సెంటర్ రష్ గా మారింది. నాదెండ్ల లోని ఆయన వర్గీయులు కూడా సభకు హాజరయ్యారు.నాదెండ్ల మండల అధ్యక్షుడు శ్రీ కంజుల వీరా రెడ్డి గారు కూడా జగన్ వర్గంలో చేరారు. ఎప్పటి లాగే వరల్డ్ కప్ లో దక్షిణాఫ్రికా ఈసారి కూడా ఓటమి పాలయ్యింది. న్యూజిలాండ్ మీద 222 పరుగుల విజయ లక్ష్యాన్ని చేధించలేక పోయింది. భారత్ పాక్ మీద గెలిస్తే, కప్ దక్కే అవకాశం కనిపిస్తుంది ( ఏమంటారు!?)

Note : SSC టైం టేబుల్: Morning 9.30 to 12.00
March 24 First Language Paper 1
March 25 First Language Paper 2
March 26 Second Language
March 28 English Paper 1
March 29 English Paper 2
March 30 Mathematics Paper 1
March 31 Mathematics Paper 2
April 1 General Science Paper 1
April 2 General Science Paper 2
April 6 Social studies Paper 1
April 7 Social Studies Paper 2

No comments:

Post a Comment