Tuesday, March 8, 2011

ఘనంగా మహిళా దినోత్సవం

మహిళా దినోత్సవం సందర్భంగా ప్రాధమిక పాఠశాలల ఉపాధ్యాయ బృందం గ్రామ సర్పంచ్ శ్రీమతి దావులురి నరసమ్మ గారిని ఘనంగా సన్మానించింది. పెద్ద బడిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి M.E.O. శ్రీ M.V. సుబ్బా రావు గారు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిధి గా M.D.O. శ్రీమతి అనురాధ గారు విచ్చేసారు. విశిష్ట అతిధులుగా గ్రామ పంచాయతి సెక్రటరి శ్రీ పాల్ గారు, సీనియర్ ఉపాధ్యాయులు శ్రీ k. శివనాగిరెడ్డి గారు, పెద్దబడి H.M. శ్రీ ఐతా వెంకటేశ్వర రావు గారు, విచ్చేసారు. స్కూల్ కాంప్లెక్స్ సెక్రటరీ శ్రీ కాట్రు శ్రీనివాసరావు గారు సభా పరిచయం చేసారు. సభికులందరూ మహిళా శక్తిని, కుటుంబంలో, సమాజం లో మహిళ పాత్రను కొనియాడారు. అనంతరం గ్రామ ప్రధమ పౌరురాలు శ్రీమతి దావులురి నరసమ్మ గారిని సందర్భం గా సన్మానించారు.

సభా పరిచయం గావిస్తున్న శ్రీ కాట్రు శ్రీనివాసరావు గారు.

ఎడమ నుండి కుడికి- సీనియర్ ఉపాధ్యాయులు శ్రీ k. శివ నాగిరెడ్డి గారు, సర్పంచ్ శ్రీమతి దావులురి నరసమ్మ గారు, M.E.O. శ్రీ M.V. సుబ్బారావు గారు, M.D.O. శ్రీమతి అనురాధ గారు, పెద్దబడి H.M. శ్రీ ఐతా వెంకటేశ్వర రావు గారు, పంచాయతి సెక్రటరీ శ్రీ పాల్ గారు.

స్త్రీ శక్తి గురించి ప్రసంగిస్తున్న M.E.O. గారు.
శుభాకాంక్షలు తెలుపుతున్న M.D.O. శ్రీమతి అనురాధ గారు.


ఉపాధ్యాయ బృందం..
సన్మాన గ్రహిత శ్రీమతి దావులురి నరసమ్మ గారు, సర్పంచ్, నాదెండ్ల.

పూలాభిషేకం..


W-onderful, O-utstanding, M-arvelous, A-dorable, N-ice. A woman spells perfection. Perfection is what defines her. Happy Womens Day.

No comments:

Post a Comment